Mahesh Babu - Trivikram Srinivas - SSMB 28 | ఎపుడెపుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ కథానాయికగా ముఖ్యపాత్రలో నటించబోతన్నట్టు ప్రచారం జరుగుతోంది. (Twitter/Photo)
ఆ స్నేహంతోనే ఇప్పుడు మళ్లీ కలిసి పని చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పక్కనబెడితే బాబుతో త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో మహేష్ చెల్లిగా సాయి పల్లవి నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా కనీసం కలవలేదనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఎప్పటికీ కలిసి పని చేయకూడదని ఒకరినొకరు నిర్ణయించుకున్నారని.. సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అన్నట్లుగానే పదేళ్లకు పైగానే అయింది కదా ఈ ఇద్దరి మధ్య సినిమాలు వచ్చి. ఇక చేయరేమో అనుకుంటున్న సమయంలో ఇన్నాళ్లకు మళ్లీ సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది.
త్రివిక్రమ్ సినిమా మాత్రం 2023 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, మోహన్ బాబు కలిసి నటించారు. ఒకవేళ మోహన్ బాబు ఈ సినిమాలో నటించడం కన్ఫామ్ అయితే.. దాదాపు 33 యేళ్ల తర్వాత మహేష్ బాబు, మోహన్ బాబు ఒకే తెరపై అభిమానులు చూడొచ్చు. (Twitter/Photo)
[caption id="attachment_1210134" align="alignnone" width="1600"] మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్‌ను మరోసారి టాలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమాలో శోభన.. మరోసారి మోహన్ బాబు సరసన నటించబోతున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరు.. ‘అల్లుడు గారు’, ‘రౌడీ గారి పెళ్లాం’, చివరగా ‘గేమ్’ సినిమాలో నటించారు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత మరోసారి వీళ్లిద్దరు వెండితెరపై జోడిగా కనిపించనున్నారు. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. (Twitter/Photo)
కథ కూడా దాదాపు అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు టైటిల్ కూడా ‘పార్థు’ అని పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అతడులో మహేష్ పేరు అదే. నందు అనే పాత్ర కూడా చేసినా ఎక్కువగా పార్థు పాత్రలోనే కనిపిస్తాడు మహేష్. ఒకవేళ అన్నీ కుదిరి అతడు సీక్వెల్ అయితే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. (Twitter/Photo)