సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి.