ఆమె లేకపోతే ఈ కాంబినేషన్ కలిసేది కాదు. ఆమెవరో ఈ పాటికే అర్థమైపోయుంటుంది. మీ ఊహ నిజమే.. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. ఈమె లేకపోతే ఈ రోజు త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి పని చేసేవాళ్లు కాదేమో..? ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా దూరం అయిపోతున్న తరుణంలో చాలా తెలివిగా మహేష్ బాబును త్రివిక్రమ్‌తో కలిసి పని చేసేలా చేసారు.
ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా యాడ్స్ చేయించారు నమ్రత. ఈ పదేళ్లలో మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమాలు చేయకపోయినా కూడా యాడ్స్ చేసారు. దాంతో మనస్పర్థలు కాస్తా తొలగిపోయాయి. ఆ స్నేహంతోనే ఇప్పుడు మళ్లీ కలిసి పని చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా నమ్రత రాయబారం ఫలించడంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.