Mahesh Babu Namrata Wedding Day : మహేష్ బాబు నమ్రతల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వంశీ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ విషయం ఏమంటే.. మహేష్ బాబు కంటే నమ్రత రెండున్నరేళ్లు పెద్ద. వీళ్లిద్దరు ‘వంశీ’ సినిమా షూటింగ్లో వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. Photo : Twitter
ఐదేళ్లు ప్రేమ తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2005లో సీక్రెట్‌గా జరిగింది. అంటే కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక ఇటీవల బాలయ్య షోలో కూడా పెళ్లి ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే. ఏంటయ్యా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నావు అంటే బదులుగా మహేష్ సమాధానం చెబుతూ మొదట నాన్న ఒప్పుకోలేదని.. అయితే ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా కొంత మంది సమక్షంలోనే పెళ్లి జరిగిందని వివరణ ఇచ్చారు. Photo : Twitter
మహేష్ నమ్రతల జంటకు ఇద్దరు సంతానం.. గౌతమ్, సితార. ఇక పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా తన జీవితాన్ని కుటుంబానికి కేటాయించారు. అందులో భాగంగా మహేష్ బాబుకు సంబంధించిన బాగోగులు చూసుకుంటూ ఉంటారు. తన 17వ పెళ్లి రోజు సందర్భంగా మహేష్ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో అపురూపమైన ఫోటోను పంచుకున్నారు. నమ్రతకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Photo : Twitter
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. Photo : Twitter
ఈ షెడ్యూల్లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబు మాత్రం ఈ సినిమ ా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సర్జరీ వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మహేష్ బాబుకు సర్జరీ జరిగింది. మధ్యలో అన్నయ్య రమేష్ బాబు మృతితో మహేష్ బాబు అప్సెట్ అయ్యారు.ఓ నెల రోజుల పాటు షూట్ చేస్తే.. ఈ సినిమా షూటింగ్ పూర్తవుతోంది. ఇప్పటికే మహేష్ గత కొన్ని రోజులుకుగా మోకాలికి సంబంధించిన ఓ సమస్యతో బాధపడుతున్నారు. Photo : Twitter
ఇప్పటికే ఓ సర్జరీ జరిగింది. ఆ తర్వాత మరో సర్జరీ కూడా జరగాల్సి ఉందట. ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.. మరోవైపు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఆయా సినిమాలేని కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడదలను పోస్ట్‌పోన్ చేశాయి. Photo : Twitter
సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతలోనే చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 1న విడుదల తేదిని ప్రకటించారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మార్చి 25న వస్తున్నట్టు ప్రకటించడంతో ఆచార్య ఏప్రిల్ 29కు వాయిదా పడింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. Photo : Twitter
ఇక మహేష్ బాబు నటించిన ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ వంటి చిత్రాలు మే నెలలో విడుదలయ్యాయి. కానీ ఈ సినిమాలేని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇపుడు ‘సర్కారు వారి పాట’ సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కళావతి నుంచి ఫస్ట్ పాటను ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్ విడుదల చేశారు. Photo : Twitter
సర్కారు వారి పాట షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే Photo : Twitter