టాలీవుడ్ సూపర్ స్టార్ ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. అది అలా ఉంటే మహేష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తన కుమారుడిని చూస్తుంటే గర్వంగా ఉందని.. హైస్కూల్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌతమ్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మహేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన కొడుకు పై ప్రశంసలు కురిపించారు. Photo : Instagram
ఇక సర్కారు వారి పాట విషయానికి వస్తే.. తెలుగు సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మే 12 న విడుదలై పాజిటిల్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు మంచి ఊపును తెచ్చింది. ఇక అది అలా ఉంటే సర్కారు వారి పాట సినిమా డిజిటల్ రిలీజుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఇక ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ జూన్ 10న లేదా జూన్ 24న సినిమాను స్ట్రీమింగ్ తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సెకెండ్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. Photo : Twitter
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజు 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యేసరికి.. వరల్డ్ వైడ్‌గా 106.6 కోట్ల షేర్‌ను 171.30 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుందని అంటున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్ల బిజినెస్ కి 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.35 కోట్ల షేర్‌ను సాధించాలి. Photo : Twitter
ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. Photo : Twitter
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది. Photo : Twitter
ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది.ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. Photo : Twitter
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. Photo : Twitter
ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. Photo : Twitter