Mahesh Babu - Rajamouli | రాజమౌళి ఈ యేడాది ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్లతో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో సంచలన విజయం అందుకున్నారు. ఈ సినిమా ఊపులోనే మహేష్ బాబుతోనే నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇక మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమౌళితో చేయబోయే సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. (Twitter/Photo)
మహేష్ బాబు రాజమౌళి సినిమాన దసరా కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమై.. 2023 మార్చిలో సెట్స్ పైకి వెళ్లి.. 2024లో విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. రాజమౌళి ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని మహేష్ బాబు దాటవేశారు. (Twitter/Photo)
రాజమౌళితో సినిమా చేస్తే అది ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి మామూలు సినిమాలు చేయడం మానేసాడు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఇపుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో కాకుండా ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటారు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్లో అడ్వెంచర్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి. (Twitter/Photo)