టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా విడుదలకు మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన సర్కారు వారి పాట ట్రైలర్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్‌లో మరో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 7వ తేదిని యూసుఫ్ గూడ పోలీస్ లైన్లో నిర్వహించనున్నారు. (Twitter/Photo)
గతంలో భీమ్లా నాయక్, ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇక్కడే నిర్వహించారు. ‘సర్కారు వారి పాట’ సినిమా యూఎస్‌లో ఎన్నడు లేనట్టుగా రికార్డు స్థాయిలో 603 లోకేషన్స్‌లో విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా సినిమాలు తప్పించి తెలుగులో ఓ సినిమా ఈ రేంజ్లో ఇన్ని లోకేషన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Twitter/Photo)
ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఒకేసారి తెలుగుతో పాటు ఓవర్సీస్లో పోకిరి సినిమా విడుదలైంది. ఆ తర్వాత తెలుగు సినిమాలుక ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారింది. ఒక రకంగా తెలుగులో అత్యధికంగా ఓవర్సీస్లో 1 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు యూఎస్‌లో మరో రికార్డుకు రెడీ అవుతున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే ఈ సినిమా నుంచి నుంచి కళావతి అనే సాంగ్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.(Twitter/Photo)
‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదల చేసిన రెండో పెన్నీ సాంగ్ (Penny Music Video) కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. విడుదలైందో లేదో రికార్డ్స్ వ్యూస్‌ను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ (Penny Music Video) పాట ఇప్పటికే 29 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. టైటిల్ సాంగ్ కూడా 10 మిలియన్ వ్యూస్ రాబట్టింది. (Twitter/Photo)
నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ఏపీ సీఎం జగన్ చెప్పిన డైలాగులు చెప్పడం అదిరిపోయింది. ముఖ్యంగా మ్యారేజ్ చేసుకునే వయసొచ్చిందటావా.. ఊరుకోండి సార్.. మీకు పెళ్లేంటి... చిన్న పిల్లాడివైతేను. అందరు నీలాగే అనుకుంటున్నారు. ఇక్కడ దూల తీరిపోతుందని తన ఫిట్నెస్ కోసం ఎంత కష్టపడుతున్నాడనే విషయాన్ని మరోసారి చెప్పాడు. (Twitter/Photo)
ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తోన్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు అనే డైలాగు పేలింది. ఇక ఈ (Sarkaru Vaari Paata) సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. విడుదలకు 15 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవడం మాములు విషయం కాదు. (Twitter/Photo)
మహేష్ బాబు మే నెలలో విడుదలైన గత చిత్రాల విషయానికొస్తే.. ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. (Twitter/Photo)
సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. (Twitter/Photo)