సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) గత నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకొంది. తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా థియేట్రికల్ రన్ మగిసింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రూ. 110.12 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు రూ. 10.88 కోట్ల దూరంలో ఆగిపోయింది. అంతేకాదు మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా 91 శాతం రికవరీ పూర్తి చేసుకొని అబౌ యావరేజ్ మూవీగా నిలిచింది. సర్కారు వారి పాట ఒక్క ఓవర్సీస్ తప్ప ఎక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావలేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రెస్టాఫ్ భారత్ ఎక్కడ బ్రేక్ ఈవెన్ కాకపోవడం విశేషం. (Twitter/Photo)
ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా .. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందించారు. అంతేకాదు మే నెలలో విడుదలైన చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది. (Photo : Twitter)
ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో రూ. 36 కోట్లకు అమ్ముడైపోయింది. సీడెడ్ రూ. 13 కోట్లకు, ఉత్తరాంధ్ర రూ. 12. 50 కోట్లకు.. ఈ స్ట్ రూ. 8.50 కోట్లకు, వెస్ట్ రూ. 7 కోట్లకు, గుంటూరు రూ. 9 కోట్లకు, కృష్ణ రూ. 7.50 కోట్లకు, నెల్లూరు రూ. 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా రూ. 96. 50 కోట్లకు అమ్మారు. ఇక కర్నాటక రూ. 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ రూ. 11 కోట్లకు అమ్మారు. ఓవరాల్‌గా ఈ సినిమా అబౌ యావరేజ్‌గా మూవీగా నిలిచింది. (Twitter/Photo)