టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాకు యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. Photo : Twitter
ఇక ఈ సినిమా ఓ వైపు థియేటర్స్‌లో రన్ అవుతూనే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో అద్దె పద్దతినా స్ట్రీమింగ్కు ఉంచిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఈసినిమా సబ్‌స్కైబర్స్‌కు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇదే ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. సర్కారు వారి పాట విడుదలైన 42 రోజులకు స్ట్రీమింగ్ వచ్చింది. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. Photo : Twitter
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక అది అలా ఉంటే మహేష్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ జూలై చివరిలో ప్రారంభించాలని ప్లాన్ చేశారట టీమ్. Photo : Twitter
దీంతో ఇప్పటికే టీమ్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉందని.. మరోవైపు స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని అంటున్నారు. దీంతో అంత అనుకున్నట్లు జరిగితే జూలై చివరి వారంలో షూటింగ్‌కు వెళ్లనుంది టీమ్. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్గా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది టీమ్. ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. Photo : Twitter
ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్. Photo : Twitter