మరీ ముఖ్యంగా, సినిమా పేరు అప్పుడప్పుడూ హీరోకి ప్రాబ్లంగా మారుతుంది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో .. టైటిల్లో హీరో పేరు వచ్చేటట్టు తెరకెక్కిన సినిమాలేవి నడిచిన దాఖలాలు లేవు. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ పేరు కూడా రామ్ చరణ్‌కు ఇలాంటి చిక్కులే తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్‌ను మూట గట్టుకుంది. (Twitter/Photo)
అఖిల్‌కే కాదు...అక్కినేని ఫ్యామిలీ అసలు సిసలు అందగాడు...నాగార్జునకి కూడా సేమ్ ట్రబుల్ ఫేస్ చేసారు. చాలా ఏళ్ల కింద మన కింగ్...‘కెప్టెన్ నాగార్జున’ అని ఆయన పేరే కలిసి వచ్చే టైటిల్‌తో ఒక సినిమా చేసారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అంతేకాదు హీరో పేరే సినిమాకు పెట్టడం పెద్ద రిస్కే అని సిగ్నల్స్ ఇచ్చింది. (Twitter/Photo)
హీరోల అసలు పేర్లు పెడితే ప్లాప్ అయ్యాయి సరే...కానీ ఇంట్లో పిలిచే నిక్ నేమ్స్ పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. అందులో హీరో మహేష్ బాబు నటించిన ‘నాని’ సినిమా ఒకటి. మహేష్‌బాబును ఇంట్లో ముద్డుగా అందరు నాని అనే ముద్దు పేరుతో పిలుస్తారు. అదే పేరు సినిమాకు పెడితే మాత్రం అట్టర్ ఫ్లాపైంది. (Twitter/Photo)