ప్రస్తుతం కృతి సనన్ .. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’లో సీతమ్మ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. గ్రీన్ మ్యాట్‌లో షూట్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ కోసం ముందుగా టాకీ పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత తీరిగ్గా గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టనున్నారు.