టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) అనే సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించారు. హీరోగా మహేష్ బాబుకు 27వ సినిమా. ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇక మే నెలలో మహేష్ బాబు నటించిన పలు చిత్రాలు విడులయ్యాయి. అందులో హిట్స్ ఎన్నంటే.. (Twitter/Photo)
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే హిట్టు వస్తుంది అంటే పేరు మార్చుకుంటారు. అవసరమనుకుంటే కలిసొచ్చే సెంటిమెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ అదే బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే మాత్రం దాని జోలికి కూడా పోరు. సినిమా ఇండస్ట్రీ అంటేనే కోట్ల రూపాయలతో ఆడే జూదం కాబట్టి అక్కడ ఎవరి నమ్మకాలు వాళ్లవి. అందుకే సెంటిమెంట్ కూడా బలంగా నమ్ముతారు. స్టార్ హీరోలు కూడా దానికి మినహాయింపు కాదు.
ఉదాహరణకు మహేష్ బాబును తీసుకుంటే ఆయన తన సినిమా ఓపెనింగ్స్ కు రాడు. హీరోగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఒకటి రెండు చిత్రాల పూజా కార్యక్రమాలకు హాజరైతే.. అవేవి హిట్స్ కాలేదు. ఆ తర్వాత తన సినిమా ఓపెనింగ్స్‌కు రావడమే లేదు. చాలా ఏళ్లుగా మహేష్ బాబుకు అది ఒక సెంటిమెంట్. తన భార్య నమ్రత మాత్రమే కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు వస్తుంది. ఫిబ్రవరి 3న త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్‌కు కూడా ఆమె హాజరయ్యారు. దానికి కూడా మహేష్ దూరంగా ఉన్నారు. . ఈయన కూడా సెంటిమెంట్స్ బాగానే నమ్ముతాడు. తన సినిమాల విడుదల విషయంలో మహేష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు.
అలాంటిది ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా విషయంలో మాత్రం ఎందుకో అభిమానులను కాస్త కంగారు పెడుతున్నాడు సూపర్ స్టార్. ఈ సినిమా మే 12న (రేపు) విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల్లో ఆనందం కంటే టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. అదే మే నెల బ్యాడ్ సెంటిమెంట్. మహేష్ బాబు కెరీర్లో మే అంతగా కలిసి రాలేదు. ఆ నెలలో వచ్చిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. అందుకే మే అంటే భయపడతారు ఫ్యాన్స్.
2016 మే 20న విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఎంత దారుణంగా నిరాశపరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయింది. మహేష్ కెరీర్లో ఇంతకంటే దారుణమైన డిజాస్టర్ మరొకటి లేదు. సినిమాను కనీసం చివరి వరకు కూడా చూడలేనంత దారుణంగా ఉంటుంది బ్రహ్మోత్సవం.ఈ మూడు సినిమాలు కూడా మే నెలలోనే వచ్చాయి. ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్స్‌గా నిలిచాయి.
ఈ నమ్మకంతోనే ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాను కూడా మే 12న విడుదల అవుతోంది. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిజినెస్ రూ. 120 కోట్లకు జరిగింది. మొత్తానికి కలిసిరాని మే నెలలో వస్తున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతుందో చూడాలి. మరి మహర్షిలా ఈ సినిమా హిట్ అందుకుంటుందా.. లేకపోతే.. నిజం, నాని, బ్రహ్మోత్సవం తరహాలో ఫ్లాప్ బాట పడుతుందా అనేది చూడాలి.