కమల్‌హాసన్ (Kamal hassan) లేటెస్ట్ సినిమా ‘విక్రమ్’ చిత్రంపై సూపర్‌స్టార్ మహేష్ బాబు (Maheshbabu)ప్రశంసల వర్షం కురిపించారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతో నచ్చిందని ట్విట్టర్ వేదికగా పేర్కోన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కమల్‌హాసన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా విక్రమ్ సినిమాను చూసిన మహేష్.. ట్విట్టర్ వేదికగా తన రెస్పాన్స్‌ను పంచుకున్నారు. Mahesh Babu Photo : Twitter
ఆయన రాస్తూ.. ‘‘విక్రమ్’ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. లోకేశ్ కనగరాజ్.. నేను మిమ్మల్ని కలిసి, విక్రమ్ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది.. ఎలా తెరకెక్కించారు అన్ని తెలుసుకుంటాను. సినిమా మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్ గారి నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు నా అనుభవం సరిపోదు కూడా. నేను ఆయనకు పెద్ద అభిమానిని.. చాలా గర్వంగా ఉంది. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఇరగదీశారు. అనిరుధ్ తన మ్యూజిక్‌తో మైమరిపించారంటూ పేర్కోన్నారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక విక్రమ్ దాదాపుగా థియేటర్ రన్ ముగియడంతో ఈ నెల 8వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వస్తోంది. Mahesh Babu Instagram
Kamal Haasan | Vikram OTT Date | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ సినిమా (Vikram) ‘విక్రమ్’. ఈ సినిమాకు (Lokesh Kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. మరో తమిళ నటుడు సూర్య (Suriya) కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా జూన్ 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తాజాగా 400 కోట్ల క్లబ్లో చేరింది. రజనీకాంత్ 2.0 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన 2వ తమిళ సినిమా విక్రమ్. ఈ సినిమా ఇప్పటి వరకు 404 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. వీటిలో 120 కోట్ల రూపాయల వసూళ్లను ఓవర్సీస్ నుండి వచ్చాయి. Photo : Twitter
ఇక మరోవైపు ఈ చిత్రం తమిళనాడులో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ తమిళనాడు రాష్ట్రంలో 155 కోట్లు రాబట్టి కేక పెట్టించింది. ఇక కమల్ విక్రమ్ దాదాపుగా మూడు వారాల్లో 155 కోట్లకు పైగా రాబట్టింది. Photo : Twitter
దీంతో ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టడంతో కమల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు కలెక్షన్స్ విషయానికి వస్తే.. తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చిన చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి మంచి వసూళ్లను అందుకుంది. ఈ సినిమా తెలుగులో 27 కోట్లకు పైగా గ్రాస్‌ను 15.09 కోట్ల షేర్‌ను అందుకుని 7.50 కోట్ల టార్గెట్ కి డబుల్ ప్రాఫిట్‌తో 7.89 కోట్లతో డబుల్ బ్లాక్ బస్టర్‌గా కేక పెట్టించింది. Photo : Twitter
ఈ సినిమా మొత్తంగా 100 కోట్ల బిజినెస్ చేయగా.. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 78 కోట్లకు పైగా ప్రాఫిట్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. Photo : Twitter
ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇది ఆ బ్యానర్లో వచ్చే 50వ సినిమా. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు. Photo : Twitter
ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇది ఆ బ్యానర్లో వచ్చే 50వ సినిమా. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు. Photo : Twitter