Mahesh Babu | Sarkaru Vaari Paata OTT : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఎవరో అనే విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది. సర్కారు వారి పాట ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు అంటే జూన్ సెకండ్ వీక్‌లో స్ట్రీమింగ్ రానుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Photo : Twitter
ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆట మొదలైంది. అంతేకాదు ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అప్పుడే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినిమా మంచి కమర్షియల్ హిట్కానుందని అంటున్నారు. మాస్ మసాలా ఫార్మూలా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. దీంతో మహేష్‌కు మరో హిట్ దొరికిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చివరగా విడుదలైన మాస్ సాంగ్, మ..మ.. మహేశాకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ స్టెప్స్‌తో తెగ వైరల్ అవుతోంది. కలర్ ఫుల్ కాస్టూమ్స్‌తో అదరగొట్టే స్టెప్స్‌తో వావ్ అనిపించారు మహేష్ బాబు, కీర్తి సురేష్. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుంది. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. Photo : Twitter
ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. Photo : Twitter
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది. Photo : Twitter
ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ (Sarkaru Vaari Paata) సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. Photo : Twitter
ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టారనేది కథాంశం. కథ విషయానికి వస్తే.. మహేష్ (మహేష్ బాబు) యుఎస్‌లో లోన్ రికవరీ వ్యాపారంలో ఉంటాడు. కళావతి (కీర్తి సురేష్) అనే అమ్మాయి అతని దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమవుతుంది. దీంతో మహేష్ ఆమెను హెచ్చరిస్తాడు. అయితే కళావతి తన తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని)ని పిక్చర్లోకి తీసుకువస్తుంది. దీంతో మహేష్ తన డబ్బును తిరిగి పొందడానికి ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. Photo : Twitter