ఈ షెడ్యూల్లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అది అలా ఉంటే ఆ మధ్య ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ లుక్ ఆయన ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. Photo : Twitter
అందులో భాగంగా ట్విట్టర్లో సర్కారు వారి పాట ఫస్ట్ లుక్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ ఏడాది ట్విట్టర్ ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో మోస్ట్ క్వోట్ ట్వీటెడ్ ట్వీట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ఇండియా స్వయంగా పేర్కోంటూ ఓ ట్వీట్ కూడా చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2021లో మోస్ట్ ట్వీటెడ్ టాప్ 5 సినిమాల విషయానికి వస్తే.. మొదటి స్థానంలో విజయ్ మాస్టర్ సినిమా నిలిచింది. ఆ తర్వాత వరుసగా అజిత్ వాలిమై, విజయ్ బీస్ట్, సూర్య జైభీమ్, ఐదవ స్థానంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నిలిచింది. Photo : Twitter
ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలను వస్తున్నాయి. ఓ వైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.. మరోవైపు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. Photo : Twitter
ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించిగా.. మధ్యలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అంతా తారుమారు అయ్యింది. సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న విడుదలకానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. Photo : Twitter
సర్కారు వారి పాట షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. Photo : Twitter