రీసెంట్గా మహేష్ బాబు.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ షో’లో స్పెషల్ గెస్ట్‌గా హాజరై తన పర్సనల్‌తో పాటు సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి మధ్య రాపో చూసి అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. బాలయ్య, మహేష్ బాబు తండ్రి అడుగు జాడల్లో బాల నటులుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. అయితే మహేష్ బాబు ఓ సినిమా విషయంలో బాలయ్యను ఫుల్లుగా వాడుకున్నారు. (Twitter/Photo)
కొరటాల శివ టేకింగ్‌కు మహేష్ బాబు నటన తోడై ఈ సినిమా సూపర్ హిట్టైయింది. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు ఇపుడు టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా అందరి హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీ ఉంది. అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న అందరు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది. ఐతే.. ఇదే ’శ్రీమంతుడు’ సినిమా స్టోరీని అప్పట్లో 1984లో బాలకృష్ణ ఓ సినిమా చేసారు.
సోలో హీరోగా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న రోజులవి. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జననీ జన్మభూమి’ సినిమా చేసాడు. ఈ చిత్రంలో హీరో కోటీశ్వరుడు. ఇందులో కూడా హీరో ఓ ఊరిని దత్తత తీసుకొని.. ఆ ఊరి ప్రజలను సారా,మద్యం నుంచి విముక్తి చేసి మంచి చేయాలని చూస్తాడు. అందుకోసం ఎన్నో కష్టనష్టాలను భరిస్తాడు. చివరకు ఊరిని బాగు చేయాలన్న తన సంకల్పాన్ని ఎలా నేరవేర్చుకున్నాడన్నదే ‘జననీ జన్మభూమి’ స్టోరీ. (File/Photo)
అప్పట్లో ఈ సినిమాను కే.విశ్వనాథ్.. కమర్షియల్ హంగులుకు దూరంగా సాదాసీదాగా తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ అదే స్టోరీ పాయింట్‌ను కొరటాల శివ తీసుకొని తనదైన ట్రీట్మెంట్తో కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన మహేష్ బాబుకు మంచి సక్సెస్ అందించారు. (Twitter/Photo)
మధ్యలో చిరంజీవి హీరోగా కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రవీణ’ కూడా దాదాపు ఇదే ఇతివృత్తంతో తెరకెక్కింది. ఈ సినిమాకు అవార్డులు వచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. మొత్తంగా సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన కథతో బాలకృష్ణ, చిరంజీవిలు ఫ్లాప్స్ అందుకుంటే.. మహేష్ బాబు మాత్రం సూపర్ హిట్ అందుకున్నారు.
మొత్తంగా ఎంత మంచి కథ అయిన.. దాన్ని ప్రేక్షకులకు నచ్చే రీతిలో తెరకెక్కిస్తే.. ఆదిరిస్తారనే దానికి ‘శ్రీమంతుడు’ సినిమా ఒక ఉదాహరణ. ఒక్కో సారి స్టోరీ బాగున్నా ఒక్కోసారి సరైనా సమయంలో విడుదల కాక విఫలమవుతూ ఉంటాయి. ఏమైనా మంచి కథ ఉన్న.. దాన్ని ప్రేక్షకులు ఆదిరించే దానిపై సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఈ సినిమా హిందీలో ధర్మేంద్ర హీరోగా హిట్టైయిన ‘యాదోంకి బారాత్’ సినిమాకు రీమేక్. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా వెంకటేష్ హీరోగా నటించిన ‘వారసుడొచ్చాడు’ సినిమాను కొద్ది మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. అటు ‘పోకిరి’ సినిమా కూడా చిరంజీవి నటించిన ‘స్టేట్ రౌడీ’ సినిమా స్పూర్తితో తెరకెక్కించారు పూరీ జగన్నాథ్. మొత్తంగా బాలయ్య నటించిన సినిమాలనే కాదు వెంకటేష్, చిరంజీవి సినిమలను కాస్తా అటు ఇటు మార్చి మహేష్ బాబు మంచి సక్సెస్‌లు అందుకున్నారు. (File/Photo)