గత కొన్నేళ్లుగా మన హీరోలు ఒక వైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్‌తో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ కమర్షియల్ యాడ్స్ అనేవి పెద్ద హీరోలకే వెళతాయి. వాళ్లకున్న క్రేజ్‌తోనే ఆయా బ్రాండ్స్‌కు తగ్గట్టే వాళ్లకు పారితోషకం ముట్టజెబుతారు. దీంతో మన హీరోలు ఆయా యాడ్స్‌లో ఒక్కోసారి ఉన్నవి లేనట్టు.. లేనవి ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ యాడ్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ప్రకటనల్లో జారీ చేసే వాటిల్లో తప్పుడు సమాచారం ఉంటే ఆయా ప్రకటన కర్తలతో పాటు అందులో నటించే వాళ్లకు భారీగా జరిమానా విధించే కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. Photo Twitter
దాంతో తమ ఇమేజ్‌తో బ్రాండింగ్ చేసే హీరోలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. తెలుగులో ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు యాడ్స్ విషయంలో కింగ్స్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు హీరోల చేతుల్లోనే ఎక్కువ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఉన్నాయి. తాజాగా కేంద్రం అడ్డదిడ్డంగా అడ్వైర్టైజ్మెంట్స్ చేసే హీరోలకు ముక్కుతాడు వేసేందుకు కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది.
అందులో ముఖ్యంగా సరోగసీ యాడ్స్‌ను ప్రముఖంగా ప్రస్తావించాలి. దాంతో పాటు బాడీ రిఫ్రెషనర్తో పాటు పాన్ మసాలాను వక్కపొడి అంటూ ప్రకటనల్లో చూపించడం వంటివి బీరు కంపెనీలకు సంబంధించి మంచి నీళ్లు అని చెప్పించడం ఇకపై కుదరదు. ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించిన యాడ్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ గైడ్ లైన్స్ సూచిస్తోంది. (Pushpa Mahesh Babu)
ఈ సందర్భంగా ఓ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న అల్లు అర్జున్ పై తాజాగా కేసు నమోదు అయింది. ఇకపై ప్రకటనలు చేేసే విషయంలో ఆయా హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మరి చేయాలి. లేకపోతే.. లీగల్‌గా చిక్కులు తప్పవు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్.. ర్యాపిడో యాడ్‌లో ఆర్జీసీని తక్కువ చేసిన చూపించడంతో ఆర్జీసీ ఎండీ బన్నిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ప్రభుత్వ రంగ సంస్థపై కించ పరిస్తూ చేసిన ఈ యాడ్ పై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఆర్జీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక పనిచేసి యాడ్ ను కాస్త మారిస్తూ రూపొందించారు. ఆ తర్వాత బన్ని జొమాటో యాడ్‌లో సౌత్ ఇండియాలో యాక్షన్ సీన్స్ ఇలానే ఉంటాయని ఆ ప్రకటనలో చెప్పడం వివాదం అయింది. దీంతో బన్ని.. నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ మొదలైంది. దీంతో సదరు సంస్థ ఆ యాడ్‌ను విత్ డ్రా చేసుకుంది.
తాజాగా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన వాణిజ్య మార్గ దర్శకాల ప్రకారం.. ముఖ్యంగా తప్పుడు ప్రకటనలతో కూడిన అసత్య ప్రచారాలు చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామంటోంది. ముఖ్యంగా చిన్న పిల్లపై ఆకట్టుకునేలా చేస్తోన్నా యాడ్స్ పై మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా కొన్ని పానీయాల కంపెనీ.. ఈ డ్రింక్ తాగితే పొడువు పెరుగుతారు.. లావు తగ్గితారు. సన్నబడతారు. నా ఎనర్జీ ఈ డ్రింక్‌లోనే ఉందంటూ ఊకదంపుడు ప్రచారం చేసే వాళ్లపై ఇకపై కఠినంగా వ్యవహరించేలా ఈ మార్గదర్శకాలున్నాయి. (Twitter/Photo)
ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల్లో ఏమున్నదో అసలు వాస్తవాన్ని మాత్రమే చెప్పాలంటున్న కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ. ముఖ్యంగా కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన తప్పుడు సమాచారానికి సంబంధించిన ప్రకటనలో నటిస్తే వాళ్లు శిక్షార్హులు అవుతారు. ముఖ్యంగా తప్పుడు ప్రకటనలు.. ప్రజలను తప్పదొవ పట్టించే ప్రకటనలతో పాటు.. వాస్తవ దూరంగా ఉండే ప్రకటనలు ఇకపై చేయడం కుదరదు. ఇలాంటి ప్రకటనలు వినయోగదారుల హక్కులకు భంగం కలిగిస్తాయని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది.
ముఖ్యంగా తప్పుడు ప్రకటనలు.. తప్పు దొవ పట్టించే ప్రకటనల్లో నటించినా .. దాన్ని ప్రసారం చేసిన వారికి మొదటిసారి రూ. 10 లక్షల వరకు జరిమానాతో పాటు మూఢేళ్ల పాటు నిషేధం విధిస్తామని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇకపై మన హీరోలు ముఖ్యంగా మహేష్ బాబు, బన్నితో పాటు మిగతా హీరోలు.. తాము చేసే యాడ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే. లేనిపోని చిక్కులు కొనితెచ్చుకున్నట్టే.. ముఖ్యంగా కేసులు, జరిమానాలు ఎదుర్కొవాల్సిందే. (Twitter/Photo)