MAHESH BABU ALLU ARJUN AGAIN BOX OFFICE WITH HIS MOVIES HERE ARE THE DETAILS TA
Mahesh-Allu Arjun: మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనబోతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్..
Mehesh Babu-Allu Arjun | ఈ యేడాది సంక్రాంతి బరిలో ఒకరి సినిమాతో మరొకరు బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అన్న వీళ్లిద్దరు మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు.
ఈ యేడాది సంక్రాంతి బరిలో ఒకరి సినిమాతో మరొకరు బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అన్న వీళ్లిద్దరు మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. (Twitter/Photo)
2/ 6
ఈ యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పలకరించాడు. మరోవైపు వన్ డే గ్యాప్‌లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో‘అల వైకుంఠపురములో’ సినిమాలో పలకరించాడు. (Twitter/Photo)
3/ 6
‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఒక రకంగా సంక్రాంతి రేసులో ఒక అడుగు ముందు వరసలో నిలిచింది ‘అల వైకుంఠపురములో’ సినిమా. ( Photo : Twitter)
4/ 6
ఇపుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. అన్‌లాక్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ తెరుచుకున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటకలో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. Instagram
5/ 6
ఈ సందర్భంగా చెన్నైలో థియేటర్స్ ఓపెన్ చేయగానే ముందుగా అక్కడ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను ప్రదర్శించనున్నారు. (File/Photo)
6/ 6
మరోవైపు బెంగళూరులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రదర్శించనున్నారు. దాంతో పాటు నితిన్ ‘భీష్మ’ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. (Allu Arjun Mahesh)