Maha shivratri | శివుడు విలక్షణ దైవం. ఆయన భక్త సులభుడు. కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయనను భోళాశంకరుడు అన్నారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి.. మారేడు పత్రాలతో పూజచేస్తే పరవశించి పోతాడాయన. నిరాడంబరుడైన పరమశివుని తత్త్వం మాత్రం మాహాద్భుతం. బ్రహ్మదేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారకుడు. ఈ లయకారుడి మహాలింగోద్భవం జరిగిన రోజే శివరాత్రి. ప్రతి యేటా మాఘ బహుళ చతుర్థుతి రోజున శివరాత్రి జరుపుకోవడం హిందువుల సంప్రదాయం. శివయ్యకు మాత్రం ఈ రాత్రి మహారాత్రి.. ఈ రాత్రి ఆయన కోసమే.. అందుకే ఈ రాత్రిని మహా శివరాత్రి అంటారు. ఆ మహాదేవుని లీలలను కూడా ఎంతో మంది దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు.ఇక ఆయన ముఖ్యపాత్రలతో పాటు శివ దేవునిపై తెలుగులో చాలా చిత్రాలే వచ్చాయి. చాలా మటుకు మన అగ్ర హీరోలు.. మహా దేవుని వేషం వేసి మెప్పించారు. అలా తెెలుగు తెరపై శివుడిగా మెప్పించిన హీరోలెవరున్నారో చూద్దాం. (File/Photos)
1962లో తెరకెక్కిన ‘దక్షయజ్ఞం చిత్రాన్ని కడారు నాగభూషణం స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ప్రతి శివరాత్రికి ఏదో ఒక తెలుగు ఛానెల్లో ఈ సినిమాను తప్పక ప్రదర్శిస్తూ ఉంటారు. అటు విజయ ప్రొడక్షన్స్‌లో 1968లో వచ్చిన ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ సినిమాలో కూడా మహా శివుడి వేషంలో మెప్పించారు. ఈ రెండు సినిమాలు చేసిపుడు ఎన్టీఆర్ ఇంట్లో కీడు జరగడంతో ఆ తర్వాత శివుడి పాత్రలు ఏ సినిమాలు చేయలేదు. (YouTube/Credit)
తమిళ అగ్ర నటుడు విజయ్ కాంత్.. ‘మధుర మీనాక్షి’ అనే డబ్బింగ్ సినిమాలో శివుడిగా మెప్పించడం విశేషం. వీళ్లతో పాటు పలువురు హీరోలు కూడా ఈ పాత్రలను చేసి మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో ఆ పరమ శివుడి పాత్రలో పలువురు నటులు యాక్ట్ చేసి మెప్పించడం విశేషం. (YouTube/Credit)