Keerthy Suresh Saree Pics: కీర్టీ సురేష్ చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు.. మహా నటి మరో ఎత్తు.. అంతలా క్రేజ్ తెచ్చి పెట్టింది కీర్తీ సురేష్ కు. ఆ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మనటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కీర్తి సురేష్ నటిస్తోంది. గుడ్ లక్ షఖీ, భొళా శంకర్ సినిమాల్లో నటిస్తోంది. మరికొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఇక సోషల్ మీడియాలో ఆమె తాజాగా పెట్టిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram
ప్రస్తుతం కీర్తి తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. Photo: Instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మహేష్ ఫ్యాన్ ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా దురుచూస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమాతో మొదటిసారి కీర్తి మహేష్ తో జతకడుతుంది. Photo: Instagram
ఈ సినిమాలో కీర్తి సురేష్ కు సంబంధించిన ఆవార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ వయోలిన్ కూడా చక్కగా వాయిస్తుంది. ఇప్పటికే కీర్తి వయోలిన్ వాయించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్ సర్కారు వారిపాటలో కీర్తితో ఒక పాట పాడించవచ్చుగా అని అభిమానులు కోరుతున్నారు. దీనికి సమాధానంగా పాడటం లేదు కాని వయోలిన్ వాయిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు తమన్. Photo: Instagram
మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను సంప్రదిస్తున్నారని టాలీవుడ్ టాక్. బోయపాటి – బన్నీ కాంబినేషన్లో సరైనోడు సినిమా మంచి గుర్తింపు తెచ మరో ప్రాజెక్టును సెట్ చేశారు. ప్రస్తుతం ‘అఖండ’ సినిమా విడుదల పనుల్లో ఉన్న బోయపాటి, ఆ తరువాత బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకుంటున్నారట. Photo: Instagram
మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ నెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. (Photo: Instagram
హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. Photo: Instagram
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక కీర్తి (Keerthy Suresh good luck sakhi)నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖీ.. ఈ సినిమా ఓటీటీలో విడుదలకానుందని తెలుస్తోంది. Photo: Instagram
త్వరలో విడుదలకు సిద్ధమైంది కీర్తీ సురేష్ లీడ్ రోల్ లో ఉన్న గుడ్ లక్ సఖి.. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన `చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే అనేకసార్లు వాయిదాపడింది కీర్తి సురేష్ మూవీ. గతేడాది నుంచి ఇప్పటికే ఒక పది సార్లు రిలీజ్ డేట్ ప్రకటించడం, వాయిదా వెయ్యడం జరిగింది. లేటెస్ట్ గా ఇంకో డేట్ వచ్చింది. మొన్నటివరకు నవంబర్ 26 అంటూ చెప్పిన ఈ సినిమా మేకర్స్ ఇప్పుడు.. మళ్లీ డేట్ మార్చినట్టు సమాచారం.