నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఆగష్టు 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాపైంది. (Twitter/Photo)
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) - రూ. 3 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ -రూ. 10 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 19 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.20 కోట్లు.. ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 21.20 కోట్లు జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 22కోట్లు రాబట్టాలి. (Twitter/Photo)
మాచర్ల నియోజకవర్గం ఓటీటీ విషయానికొస్తే.. అమేజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం ఓటిటి రైట్స్ తీసుకున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రం ఓటిటి లో రిలీజైంది. అటు జీ 5లో కూడా విడుదలైంది. అక్కడ కూడా ఈ సినిమాకు సరైన ఆదరణ దక్కలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వాల్డ్ టెలివిజన్ ప్రీమియర్ను శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి థియేటర్స్లో, ఓటీటీలో సరైన ఆదరణ దక్కని నితిన్ మూవీ టీవీలో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. (Twitter/Photo)
నితిన్ ఈ సినిమాలో గుంటూరు జిల్లా కలెక్టర్గా కనిపించాడు. మరోవైపు నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా అంతా మాచర్ల నియోజకవర్గం ఏరియాకు సంబంధించిన రాజకీయం చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ఎన్నికల అధికారిగా నితిన్ నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్.