MAA President Naresh - Kavitha: సీనియర్ నటి కవితను పరామర్శించిన ‘మా’ అధ్యక్షుడు నరేష్..

MAA President Naresh - Kavitha: సీనియర్ నటి కవిత(actress Kavitha) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈమె కొడుకుతో పాటు భర్త కూడా ఈ మధ్యే కరోనాతో కన్నుమూసారు. 20 రోజుల వ్యవధిలో కొడుకు, భర్తను పోగొట్టుకుని పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు కవిత. ఈ సీనియర్ నటిని ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్‌లో పరామర్శించారు. ఇప్పుడు ఈమెను నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించారు మా అధ్యక్షుడు నరేష్(MAA Naresh). ఆయనతో పాటు మా సభ్యులు కరాటే కళ్యాణి మరికొందరు కూడా ఉన్నారు.