విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచన, నిర్మాణం, దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ఎప్పుడో ప్రారంభించారు. తన కుమార్తె ఐశ్వర్యను ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం చేస్తున్నారు అర్జున్.
తన లైఫ్ లో విశ్వక్ సేన్‌కు చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదన్నారు. కేరళ లో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అని అడిగారన్నారు. అయితే ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారని.. ఆయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయని అర్జున్ తెలిపారు. సీనియర్ హిరో లు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారన్నారు.
అర్జున్ తనపై చేసిన ఆరోపణలకు అటు విశ్వక్ సేన్ కూడా స్పందించారు. తనకు సెట్స్‌లో సరైన మర్యాద ఇవ్వలేదన్నారు. చిన్న చిన్న మార్పులు చెప్పినా కూడా అర్జున్ తన మాట లెక్కచేయలేదన్నారు. అందుకే తన మనసుకు నచ్చిన పని చేయడం ఇష్టంలేక సినిమా నుంచి తప్పుకున్నానని విశ్వక్ సేన్ తెలిపారు. Vishwak Sen next movie Photo : Twitter

అయితే విశ్వక్ సేన్‌కు వివాదాలు కొత్తేం కాదు. అంతకుముందు కూడా ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. సొంత కష్టంతో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్. తనదైన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.అయితే ఇప్పుడు ఆయన ఆ యాటిట్యూడ్ ఆయనకు కష్టాలు తెచ్చి పెడుతోంది.