గతేడాది జరిగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను మరిపించాయి. మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకున్నారు. చివరకు ఈ ఎన్నికల్లో మోహన్ బాబు ఎత్తుల ముందు అందరు చిత్తయ్యారు. తన కుమారుడిని మా అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టగలిగారు. మా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించి యేడాది పూర్తైయిన సందర్భంగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో పాటు ఇతర ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా మూవీ ఆర్ధిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్‌కు సంబంధించిన రెండు ఆప్షన్లను అసోసియేషన్ ముందు ఉంచానని మంచు విష్ణు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా యేడాది కాలంలో ‘మా’ అధ్యక్షుడి తమ సభ్యులతో చేసిన పనుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్‌గా అందరికీ జావాబుదారిగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. (Twitter/Photo)
ఫిల్మ్ ఛాంబర్‌కు దగ్గరలో ఓ అరగంటలో చేరుకునే ప్రాంతంలో ఓ భవంతిని చూశానన్నారు. ఆరు నెలల్లో అది కంప్లీట్ అవుతుందన్నారు. మా బిల్డింగ్‌కు అది ఫస్ట్ ఆప్షన్ అన్నారు. రెండోది ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ తీసేసి కొత్త భవంతి కట్టబోతున్నారు. అక్కడ నేను కొంత స్థలం కొని సంస్థకు ఇస్తాను. అక్కడ మా ఆఫీస్ కూడా రాబోతుందన్నారు.
మొదటి ఆప్షన్ అయితే.. ఆరు నెలల్లో పూర్తవుతోంది. రెండో ఆప్షన్‌కు కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు. అయితే మేము నిర్వహించిన ‘మా’ సభ్యుల సర్వసభ్య సమావేశంలో సభ్యులందరు రెండో ఆప్షన్‌ను కోరుకున్నారు. ఈ రెండింటిలో ఏది ఓకే అయినా ఆ పనులను నా డబ్బులతో పూర్తి చేస్తానని చెప్పారు మంచు విష్ణు. (Twiter/Photo)
ఈ సందర్భంగా మా అధ్యక్షడిగా యేడాది కాలంలో ఏయే పనులు పూర్తి చేపామో చెప్పుకొచ్చారు. ప్రతి నటుడికి ఛాన్సెస్ రావాలన్న ఉద్దేశ్యంతో ఒక బుక్ ప్రింట్ చేసి ప్రతి యాక్టివ్ నిర్మాతలకు పంపామన్నారు. తద్వారా ఆయా నటీనటులకు అవకాశాలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి విదేశాల్లో భారీ ఈవెంట్స్ చేయబోతున్నట్టు చెప్పారు. ఈ నెల 20వ తేదిని ఈ విషయాలను మీడియాకు వెల్లడిస్తానన్నారు. (Twitter/photo)