మా ఎన్నికలు జరుగుతన్నప్పటి కంటే కూడా అయిపోయిన తర్వాతే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఓడిపోయిన తర్వాత కామ్‌గా కాంప్రమైజ్ అయిపోతారేమో అనుకుంటే.. ఎవరూ ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా గెలిచిన పదవులకు రాజీనామా చేసారు. బహుశా ఈ పరిణామం మంచు విష్ణు కూడా ఊహించి ఉండడేమో..? ఇప్పటి వరకు వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించినా కూడా కుదరడం లేదు.
అక్కడ శ్రీ కృష్ణ పాత్రదారి అని చెప్పుకుంటున్న నరేష్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయాన్ని అస్సలు ఊహించలేదేమో..? అంత కొత్త స్టెప్‌తో మంచు విష్ణు ప్యానెల్‌ను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసారు ప్రకాష్ రాజ్ అతడి ప్యానెల్ కలిసి. అందరం కలిసి పని చేసుకుందాం.. ఎన్నికల వరకే ఈ గొడవలన్నీ.. ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది.. మనం మనం అంతా ఒక్కటే అంటూ విష్ణు ఎంత చెప్తున్నా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు.
చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మోహన్ బాబు మంచు విష్ణు,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మోహన్ బాబు మంచు విష్ణు భేటికి ముహూర్తం ఖరారు,మా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు" width="1200" height="800" /> రాజీనామాలు ఆమోదించినా.. దించకపోయినా తమకు వచ్చే నష్టమేం లేదంటున్నారు. తామైతే మా ఆఫీసుకు వచ్చే ప్రసక్తే లేదని.. అధికారంలో మీరే ఉండాలంటూ కోరారు. అయినా ఒకరో ఇద్దరో రాజీనామాలు చేస్తే కూర్చుని బుజ్జగించే పనులు పెట్టుకోవచ్చు. కానీ ఏకంగా 11 మంది సభ్యులు రాజీనామా చేస్తే పాపం విష్ణు మాత్రం ఏం చేస్తాడిప్పుడు..? అందుకే మా ఎన్నికలు ముగిసిన రెండు నెలల తర్వాత వాళ్ల రాజీనామా ఆమోదించాడు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామాలు చేసారు. శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. పునరాలోచించుకోవాలని కోరినా.. వద్దని వారించినా కూడా వినలేదని.. అందుకే ఆమోదించామని క్లారిటీ ఇచ్చాడు విష్ణు. అయితే మా సభ్యత్వానికి సైతం రాజీనామా చేసిన నాగబాబు, ప్రకాష్ రాజ్‌కు మాత్రం విష్ణు షాకిచ్చాడు. అది ఒప్పుకోవట్లేదని చెప్పాడు.
రాజీనామాలు ఆమోదించడంతో వాళ్ల స్థానంలో కొత్త వాళ్ళను నియమించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వాళ్లను నియమించటమే విష్ణు ముందున్న ఏకైక మార్గం అనిపిస్తుంది. ఇదే విశ్లేషకులు కూడా చెప్తున్న మాట. ఈ విషయంలో మోహన్ బాబు కూడా ఒకే మాట మీదున్నట్లు తెలుస్తుంది. వాళ్లంతట వాళ్లు వచ్చి రాజీనామా వెనక్కి తీసుకుంటే ఓకే.. లేదంటే వదిలేసేయ్ అనే నిర్ణయంతోనే ఉన్నారు.. చివరికి వాళ్లు రాలేదు.. రాజీనామాల ఆమోదం జరిగిపోయింది.
ఒకవేళ 'మా'లో ఓ స్థానం ఖాళీ అయితే దాన్ని భర్తీ చేసే అధికారం అసోసియేషన్ అధ్యక్షుడికి ఉంది. 'మా' అసోసియేషన్ బై లా రూల్ పొజిషన్ 17 ప్రకారం.. పోస్ట్ ఖాళీ అయితే అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని భర్తీ చేస్తారు. ఆ పదవికి మరొక వ్యక్తిని నామినేట్ చేస్తారు. ఆ నియామకం జనరల్ బాడీ మీటింగ్‌లో సభ్యుల అనుమతి తీసుకోవాలి. సర్వసభ్య సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
ఇలాంటి సమయంలో శ్రీకాంత్ ఎవరిపై గెలిచాడు అనేది చూడొచ్చు. అక్కడ బాబు మోహన్‌పై గెలిచాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఆ పదవికి రాజీనామా చేసాడు కాబట్టి బాబు మోహన్నే అధ్యక్షుడు మంచు విష్ణు నామినేట్ చేసుకునే అధికారం ఉంటుంది. సభ్యుల సహకారం.. కమిటీ తీర్మాణంతో తన అధికారం వాడి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు 11 మంది సభ్యులను విష్ణు ఎవరితో భర్తీ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.