ప్రకాష్ రాజ్ విషయానికొస్తే.. ఒక భాషకు పరిమితం కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. తొలిసారి ప్రకాష్ రాజ్.. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ‘మా’ ఎన్నికల బరిలో అధ్యక్షుడిగా పోటీ పడుతున్నారు. (Twitter/Photo)
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పై లోకల్, నాన్ లోకల్ అంటూ మరోసారి మా కార్యవర్గ సభ్యుల్లో కొంత మంది కారాలు మిరియాలు నూరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు గతంలో తన ప్రవర్తన కారణంగా ఈయనపై ‘మా’ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయమై వారు ‘మా’ మిగతా సభ్యుల ముందు ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారు. (Twitter/Photo)
మా’ ఎన్నికలు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే సంబంధించినవి. కానీ కొన్నేళ్లుగా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా ఇవి రసవత్తరంగా జరుగుతున్నాయి. అక్కడ కూడా పీకులాటలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. manchu vishnu and prakash raj
ప్రకాశ్ రాజ్ వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్. ఇలాంటి వ్యక్తికి షూటింగ్స్‌కే సమయం సరిపోదు. ఇక ‘మా’ అధ్యక్షుడు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సమయం కేటాయిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏదైనా ఇష్యూ వస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపే తీరక ఉంటుందా అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. (Prakash Raj)
పైగా ప్రకాశ్ రాజ్ షూటింగ్స్‌కు లేట్‌గా వస్తారనేది ఓ అభియోగం. పైగా సెట్స్‌లో మిగతా ఆర్టిస్టులతో ఆయన ప్రవర్తన కూడా సరిగా ఉండదని చెబుతున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా పక్క రాష్ట్రం చెన్నైలో కంటే స్వరాష్ట్రంలోనే సినిమాలు చేయాలనే సంకల్పంతో ఇక్కడి వచ్చారనే విషయం గుర్తు చేస్తున్నారు. తెలుగులో ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆర్టిస్టులున్నారు. వీరెవరిని కాదని ఎ‘మా’ ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ తప్ప వేరెవరు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.