కొన్నేళ్లుగా స్నేమ పూర్వకంగా జరిగే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ సారి మాత్రం జనరల్ ఎలక్షన్స్‌ను తలద్నేలా ఉన్నాయి. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ హేమా పోటీలో ఉన్నారు. దీంతో ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షులుగా ఈ పీఠాన్ని అధిరోహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
1.ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దదన్న ప్రకాశ్ రాజ్.. త్వరలో జరగబోయే మా అధ్యక్ష ఎన్నికల్లో మా ప్రతిష్ట కోసం.. బాగోగుల కోసం బరిలో దిగబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మాకు పదవులు కాదు.. పనులు చేయడమే ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా తన తరుపున పోటీలో పాల్గొనే ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. ఇందులో పలువురు నటీనటులతో పాటు జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. (Twitter/Photo)