గత కొన్నేళ్లుగా స్నేమ పూర్వకంగా జరిగే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ సారి మాత్రం సాధారణ ఎన్నికలను తలపించే విధంగా మారాయి. ఇప్పటికే మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీలో ఉండగా.. తాజాగా నటి హేమ కూడా మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షులుగా ఈ పీఠాన్ని అధిరోహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. (file/Photo)
నటి హేమ ముందుగా ’మా’ ట్రెజరర్‌గా పోటీ చేయాలనుకున్నారు. కానీ పోటీలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా కొంత మంది మహిళ మద్ధతుదారులు తనను మా అధ్యక్ష ఎందుకు పోటీ చేయమని చెప్పారు. దీంతో మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలనే నిర్ణయానికి వచ్చినట్టు హేమ చెప్పుకొచ్చారు. (Twitter/Photo)
త్వరలో జరగబోయే ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. జీవిత రాజశేఖర్ కూడా ఇండస్ట్రీలో తనకు తెలిసిన వాళ్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఫైనల్‌గా ఎపుడో సెప్టెంబర్‌లో జరగాల్సిన మా అధ్యక్ష ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు తలదన్నే రీతిలో సాగనున్నట్టు తెలుస్తోంది. (Twitter/Photo)