ఓ వైపు చిరంజీవి అండతో ప్రకాశ్ రాజ్.. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ సహా మరికొందరు సీనియర్ నటుల అండతో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. మా అద్యక్ష బరిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మంచి సంబంధాలే ఉన్నాయి. మంచు విష్ణు నటించిన ‘మోసగాళ్లు’ సినిమాను ప్రమోట్ చేసారు. మరోవైపు మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రాలకు చిరు గాత్ర దానం చేసారు. మొత్తంగా చిరు అండదండలు మాత్రం ప్రకాష్ రాజ్‌కు ఉందన్నది నాగబాబు స్పష్టం చేసారు.
ఇప్పటికే మంచు విష్ణు.. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లి ఆయన మద్ధతు కోరారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్దతు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ప్రభాస్ కూడా మంచు విష్ణుకు ఆప్తీయ మిత్రుడు. ఈ సందర్భంగా ప్రభాస్ మద్ధతు కూడా మంచు విష్ణుకు లభించే అవకాశాలున్నాయి. (Twitter/Photo)