గత కొన్నేళ్లుగా స్నేమ పూర్వకంగా జరిగే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ సారి మాత్రం సాధారణ ఎన్నికలను తలపించే విధంగా మారాయి. ఇప్పటికే మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీలో ఉండగా.. నటి హేమ కూడా మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షులుగా ఈ పీఠాన్ని అధిరోహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. (file/Photo)