‘మా’ (Movie Artist Association) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ ఫ్యానెల్, మంచు ప్యానెల్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పోటీ ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అనే కంటే చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అనే చెప్పాలి.
ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ పడుతోన్న మంచు విష్ణు.. మోహన్ బాబు పెద్ద కుమారుడు. మరోవైపు ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి అండదండలతోనే రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తరుపున నాగబాబు తన వంతు ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్ధి ప్యానెల్‌ను తూర్పారా పడుతున్నారు. మరోవైపు మంచు విష్ణు ప్యానెల్.. ప్రకాష్ రాజ్ .. షూటింగ్స్‌కు సమయానికి రాకుండా ఎలా నిర్మాతలను, దర్శకులను ఇబ్బందుల పాలు చేసారనే విషయంతో పాటు లోకల్.. నాల్ లోకల్ అనే పాయింట్‌ను ఎత్తుకున్నారు. (Twitter/Photo)
ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA Elections 2021) ఎన్నికల గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఏ రోజైతే ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకొచ్చి తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడుతున్నానని ప్రకటించాడో.. అప్పట్నుంచీ అదే హీట్ కనిపిస్తుంది. ఆ తర్వాత లోకల్ చంటిగాడు అంటూ మంచు విష్ణు.. ‘మా’ ఎన్నికల బరిలో దిగడంతో హీట్ మరింత పెరగింది. (Twitter/Photo)
తెలుగు నటీనటుల కోసం ఏర్పాటైన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ది పాతికేళ్లకు పైగా ప్రస్థానం. తెలుగు సినీ రంగంలోని నటీనటులు సంబంధించిన వివాదాలు, సమస్యల పరిష్కారం, సభ్యుల సంక్షేమం కోసం ‘మా’ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. 1993లో ఈ సంఘం ఏర్పాటైంది. ఈ సంఘం ఏర్పాటు చేయాలని అప్పుడు విశాఖలో పోలీస్ శాక సహాయార్ధం క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు కలెక్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తోన్న క్రమంలో మురళీ మోహన్, చిరంజీవి కలిసి ఈ సంఘం ఏర్పాటు చేయాలన్న ఆలోచనjకు బీజం పడింది. (Twitter/Photo)
‘మా’ అసోసియేషన్ ముఖ్యంగా నటీనటులకు సంబంధించిన రెమ్యునరేషన్‌తో పాటు దర్శకులు, నిర్మాతలతో వివాదాలు, సభ్యుల సంక్షేమం చూసుకోవడం కోసమే ఏర్పాటైంది. అలాగే నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారులను ఆదుకోవడం సినిమా ఛాన్సులు ఇప్పించడం ‘మా’ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఆ తర్వాత ‘మా’లో రకరకాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. (Twitter/Photo)
‘మా’ అసోషియేషన్ ముందుగా 150 సభ్యులు ఉండేవారు. పెద్ద నటీనటులకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. చిన్న నటీనటులకు కుటుంబాలు అనారోగ్యం పాలైతే వారిని వీరు ఆదుకునేవారు. ఆర్టిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం అపుడే ప్రారంభించారు. అంతేకాదు హీరోల బెనిఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బును ఈ అసోసియేషన్‌కు విరాళాలుగా ఇచ్చేవారు. (Twitter/Photo)
అప్పట్లో ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలైన విజయనిర్మల .. నిరుపేద కళాకారుల కోసం ప్రతి నెల రూ. 15 వేలు అసోసియేషన్‌కు విరాళంగా పంపంచేవారు. ఆ తర్వాత ఆర్టిస్టులు వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించేవారు. ముందుగా రూ. 5 వేలు ఉన్న సభ్యత్వ రుసుము క్రమంగా రూ. 10 వేలు, ఆ తర్వాత రూ. లక్షకు చేరింది. ప్రస్తుతం ‘మా’లో 900 మంది శాశ్వత సభ్యులున్నారు. 29 మంది అసోసియేట్ సభ్యులు.. 18 మంది సీనియర్ సిటీజన్స్ ఉన్నారు. వీరిలో 850 మంది యాక్టివ్ మెంబర్స్. (Twitter/Photo)
రాజేంద్ర ప్రసాద్ తర్వాత శివాజీ రాజా.. మా అధ్యక్షుడి బాధ్యతులు స్వీకరించారు. తెలుగు ఇండస్ట్రీలో శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకటి రెండు కాదు.. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు ఈయన. నటుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఇలా ఎన్నో వందల సినిమాల్లో నటించాడు శివాజీ రాజా.