ఈ పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత రాత్రి ఫలితాలు వెల్లడి చేయనున్నారు. రాత్రి 8 గంటలకు ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు దాదాపు 880 సభ్యులు ఓటు వేయనున్నారు. maa elections Photo : Twitter
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. దీంతో వరుసగా అందరూ వచ్చి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.