మా అసోసియేషన్లో ఇప్పటి వరకు ఏం జరిగింది.. ఎలాంటి నియమాలు ఉన్నాయి అనేది అనవసరం. నేను వచ్చాను కదా.. ఇప్పట్నుంచి అన్నీ మారుస్తాను.. మార్పులు చాలా అవసరం కూడా అంటున్నాడు విష్ణు మంచు. మా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాలా బిజీగా ఉన్నాడు విష్ణు. పెద్దలను కలవడమే కాకుండా దేవుళ్ళ దర్శనం కూడా చేసుకుంటున్నాడు.
మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న సినీ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులతో కూడా వరసగా భేటీ అవుతున్నాడు. దాంతో పాటు తన ప్యానెల్ సభ్యులతో కలిసి వచ్చి తిరుపతి శ్రీ వేంకటేశ్వరున్ని దర్శించుకున్నాడు. అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించాడు. ఈయన మాటలు విన్న తర్వాత మా అసోసియేషన్లో ఎంత వేడి ఉందో.. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది.
'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని.. అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు మంచు విష్ణు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి విమర్శలు అన్నీ తనకు వినిపిస్తున్నాయని చెప్పాడు ఈయన.
అందులో ఎలాంటి తప్పు లేదంటున్నాడు ఈయన. ఇక పెద్దల అంగీకారంతో మా అసోసియేషన్ బైలాస్ మారుస్తామని.. జనరల్ బాడీ మీటింగ్లో ఈ ప్రపోజల్ పెడతామని చెప్పుకొచ్చాడు విష్ణు. 'మా' సభ్యత్వాన్ని మరింత కఠినం చేయాల్సిన అవసరం వచ్చిందని.. ఎవరు పడితే వాళ్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కాకుండా చర్యలు తీసుకుంటాని చెప్పారు.
అలా ఒక జర్నలిస్ట్ వచ్చి మొత్తం నాశనం చేసాడని తెలిపాడు మంచు విష్ణు. ఏదేమైనా కూడా విష్ణు వ్యాఖ్యలు ఇప్పుడు మా అసోసియేషన్లో కాక పుట్టిస్తున్నాయి. మరి ఈయన చేసే మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ప్రకాష్ రాజ్ చెప్పిన నాన్ లోకల్ బై లాస్ కూడా మారుస్తారా అనేది చూడాలి. మా సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ కొన్ని కండీషన్స్ పెట్టాడు.
నాన్ లోకల్ ఆర్టిస్టులు కేవలం ఓటు వేయడానికి మాత్రమే పనికొస్తారు.. పల్లకి మాత్రమే మోయాలి.. ఎప్పుడూ సింహాసనం ఎక్కకూడదు అనే కాన్సెప్టు ఉంటే తనకు అలాంటి సభ్యత్వం అవసరం లేదని చెప్పాడు ప్రకాష్ రాజ్. ఒకవేళ అలా కాకుండా అందరికీ సమానంగా ఉండి.. నాన్ లోకల్ అనే మాటే లేకుండా బైలాస్ మారుస్తానంటే అప్పుడు రాజీనామా వెనక్కి తీసుకుంటానని చెప్పాడు ఈయన.
మరోవైపు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో పోటీ చేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదని.. అది పూర్తిగా తన స్వతంత్య్ర నిర్ణయమని చెప్పాడు విష్ణు. అయితే ఎన్నికల సమయంలో జరిగిన వాదనలు తర్వాత అనుకుని లాభం లేదంటున్నాడు ఈయన. అయితే నాన్ లోకల్ ఇష్యూ మాత్రం తెరపైకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోనే చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. ఇలాంటి సమయంలో ‘మా’లో రాబోయే మార్పులు ఎలా ఉంటాయో చూడాలి.