కియారా అద్వానీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో గ్రాండ్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్‌తో నటించిన ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కియారా. అంతేకాకుండా 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరో సూపర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లో అవకాశం దక్కించుకుంది. అంతేకాదు.. ఆ సినిమాలో మంచి తన పరిధి మేరకు నటనతో ఆకట్టుకోవడమే కాకుండా అంద చందాలతో తెలుగువారిని భాగానే ఆకర్షించింది. కానీ భారీ అంచనాతో వచ్చిన ఆ సినిమాలో మేటర్ లేక.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో ఆ సినిమా తర్వాత మరే తెలుగులో సినిమాలో నటించలేదు. మరీ తెలుగులో అవకాశాలు రావాట్లేదా..లేదా ఈ భామ కావాలనే తెలుగు కథల్నీ పక్కకు పెడుతుందా.. తెలియదు. అది అలా ఉంటే... హిందీలో ఈ భామ ఇటీవల తెలుగు 'అర్జున్ రెడ్డి' రీమేక్..'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ సరసన చేసిన సంగతి తెలిసిందే.