లవ్ టుడే తెలుగు బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజు రూ. 2.22 కోట్ల గ్రాస్ రెండో రోజు - రూ. 2.35 కోట్ల గ్రాస్ మూడో రోజు - రూ. 2.38 కోట్ల గ్రాస్ నాల్గో రోజు - రూ. 1.15 కోట్ల గ్రాస్.. ఐదో రోజు -రూ. 98 లక్షలు గ్రాస్వ.. ఆరో రోజు.. రూ. 85 లక్షలు.. ఏడో రోజు.. రూ. 75 లక్షలు గ్రాస్ వసూళ్లను సాధిచింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపి రూ. 10.65 కోట్ల గ్రాస్ (రూ. 5.51 కోట్ల షేర్) రాబట్టింది.
లవ్ టుడే తెలుగులో రూ. 2.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటికే రూ. 5.51 కోట్ల షేర్ రాబట్టి లాభాల్లో వచ్చింది. మొత్తంగా ఈ సినిమా రూ. 2.51 కోట్ల లాభాలతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూ సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకుంది. (Twitter/Photo)
లవ్ టుడే కథ విషయానికి వస్తే.. ఈ సినిమాకు దర్శకుడు, హీరో ఒకటే కావడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తాను అనుకున్న కథను అదే రేంజ్లో యూత్‌కు నచ్చేలా తెరకెక్కించడంలో అతడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇతను ప్రస్తుతం సమాజంలో నడుస్తోన్న ట్రెండింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకొని .. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. (Twitter/Photo)
లవ్ టుడే సినిమాలో ముఖ్యంగా సెల్‌ఫోన్ మనుషులు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయో.. చూపిచాడు. ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దుతూనే ఎమోషన్ పండించడంలో ప్రదీప్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెల్‌ఫోన్ మార్చుకోవడం వంటి చిన్న పాయింట్‌ను పెట్టుకొని ఈ సినిమాను చక్కగా మలిచాడు. అంతేకాదు ప్రతి పాత్రను సినిమాలో ఇన్వాల్స్ చేసేలా అతడు తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముందు ముందు ఈ సినిమా తెలుగులో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి మరి. (Twitter/Photo)