8 Love Story Succes Celebrations : నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఇంత పాజిటివ్ టాక్‌తో మొదలైన సినిమా అదే రేంజ్లో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ సందర్భంగా ‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకున్నారు. (Twitter/Photo)
శేఖర్ కమ్ముల విషయానికొస్తే.. సాధారణ ప్రేమకథను తనదైన కథనంతో రక్తి కట్టించారు. సాధారణ ప్రేమకథకు తెలంగాణ నేపథ్యాన్ని జోడించారు. దీనికి నాగ చైతన్య, సాయి పల్లవితో మంచి నటన రాబట్టారు. ఏమైనా ఓ కథను ఎలా తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనేదానికి ‘లవ్ స్టోరీ’ మంచి ఎగ్జాంపుల్ అని ప్రజలు చెప్పుకుంటున్నారు. (Twitter/Photo)
‘లవ్ స్టోరీ’ సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు బుకింగ్ ఓ రేంజ్లో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. (Twitter/Photo)
నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి. (Twitter/Photo)
వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. ‘లవ్ స్టోరీ’ సక్సెస్‌తో నాగ చైతన్య తన కెరీర్లో తొలిసారి హాట్రిక్ హిట్ నమోదు చేశారు. (Twitter/Photo)