lok sabha elections 2019: ఓటు హక్కు వినియోగించుకున్న మలయాళీ స్టార్స్..

మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 116 ఎంపీ స్థానాల్లో మూడో దశ పోలింగ్ పూర్తైయింది. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కేరళ రాష్ట్రంలో పలువరు సినీ నటులు ఉత్సాహంగా ఓటింగ్ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన మోహన్ లాల్, మమ్ముట్టి, బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు.