బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఈ రోజు మైక్ టైసన్ బర్త్ డే సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. (Twitter/Photo)
. ఇక పూరీ కెరీర్లో ఓ సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయడం ఇదే మొదటిసారి అనే చెప్పాలి.లైగర్’ మూవీలో హీరో విజయ్ దేవరకొండ.. బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కోసం మన దేశం నుంచి అమెరికాకు వెళతారు. అక్కడ అతని ఇంట్రడ్యూస్ చేస్తారు. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథ. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. (Twitter/Photo)
మరోవైపు విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను రెండో పార్ట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుంది. (Twitter/Photo)