Liger: మరో 3 రోజులు..ట్వీట్‌తో అప్ డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!
Liger: మరో 3 రోజులు..ట్వీట్‌తో అప్ డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ''లైగర్'' (సాలా క్రాస్ బ్రీడ్). మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ విజయ్ టీం అందించింది. జులై 21న లైగర్ ట్రైలర్ లాంఛ్ కాబోతుందని విజయ్ దేవరకొండ తెలియజేశాడు..3 రోజులు #LigerTrailer అంటూ ట్వీట్ చేశాడు.
విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా లైగర్ (Liger). టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ (Puri Jagannadh) దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది.
2/ 8
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ విజయ్ టీం అందించింది. జులై 21న లైగర్ ట్రైలర్ లాంఛ్ కాబోతుందని తెలియజేశాడు..3 రోజులు #LigerTrailer అంటూ ట్వీట్ చేశాడు.
3/ 8
జులై 21 ఉదయం 9:30 గంటలకు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో, అదే రోజు రాత్రి 7:30 గంటలకు ముంబై అంధేరీలోని సినీపొలిస్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించారు మేకర్స్.
4/ 8
ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే (Ananya Pandey) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ (Akdi Pakdi song)కు మంచి రెస్పాన్స్ వస్తోంది. లైగర్ చిత్రంలో రమ్యకృష్ణ కీ రోల్లో నటిస్తోంది.
5/ 8
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
6/ 8
మరో మూడు రోజుల్లో లైగర్ ట్రైలర్ రాబోతుందని విజయ్ దేవరకొండ తన ఖాతాలో ఒ పోస్టర్ షేర్ చేశాడు. 'లైగర్' నుండి ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
7/ 8
పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నారు.
8/ 8
లైగర్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.