విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక ఆ సినిమా పరాజయం తర్వాత విజయ్, పూరీ దర్శకత్వంలో చేస్తోన్న జనగణమన సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
జనగణమణ సినిమాను రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. లైగర్ చిత్రాన్ని రిలీజ్ కాకముందే జూన్ 4వ తేదీన షూటింగ్ ప్రారంభించి, ఒక షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారు. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ మై హోమ్ గ్రూప్స్ ప్రస్తుతానికి ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.