దేశవ్యాప్తంగా విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.. సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినిమాను చూసిన ప్రేక్షకులు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఎక్కువుగా పూరీ జగన్నాథ్‌ను తప్పుబడుతున్నారు నెటిజన్స్.
లైగర్ ప్లాప్ అవ్వడంతో పూరి పరిస్థితి మరి దారుణంగా తయారైంది. లైగర్ముం హిట్ అయితే మాత్రం ముంబై పూరికి పర్మనెంట్ అడ్డాగా మారిపోయి ఉండేది. పూరి జగన్నాధ్ తన కలల ప్రాజెక్ట్ జనగణమన కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని భావించారు. దీనికోసం లైగర్ షూటింగ్ సమయంలోనే ముంబైలో విలాసవంతమైన సీ ఫేసింగ్ 4 బి హెచ్ కె ఫ్లాట్ రెంట్ కి తీసుకున్నట్లు తెలుస్తోంది. Liger team Twitter
పూరి ఉంటున్న ఫ్లాట్ రెంట్ నెలకి రూ 10 లక్షలు. నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే ఇంకాస్త ఎక్కువే. ఇప్పుడు లైగర్ మూవీ తీరని నష్టాలు మిగిల్చింది. త్వరలో బయ్యర్లతో పూరి సమావేశం అయి వారి నష్టాల విషయంలో హామీ ఇవ్వన్నట్లు.. వీలైనంత మేర భరించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెలకి ఋ 10 లక్షలు రెంట్ కట్టడం అసాధ్యంగా మారుతోంది. దీంతో పూరి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.