పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో లైగర్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ అయ్యింది. విడుదల సమయంలో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే భారీ ధరకు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం వాటిల్లింది. Photo : Twitter
ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ తన బాధ్యతగా భావించి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే కొంత సమయం కావాలంటూ.. డబ్బు వాపసు గురించి ఎగ్జిబిటర్లను ఒత్తిడి చేయవద్దంటూ పూరీ మాట్లాడిన ఓ ఆడియో టేప్ ఇటీవల వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వరంగల్ శ్రీను ఇతర సబ్ డిస్ట్రిబ్యూటర్లను కలుపుకుని తనపై, తన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని పూరీ తన ఫిర్యాదులో జూబ్లీహిల్స్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక మరోవైపు లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి, దేవరకొండ అసలు ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం మానేశారని, ఇద్దరి మధ్య అప్పటి బ్రోమాన్స్ ఏమీ లేదని.. విజయ్ అసలు పూరీ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడంలేదని ఇండస్ట్రీ వర్గాల తాజా టాక్. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లో మొదలైన మరో సినిమ జనగణమన కూడా కాన్సల్ అయ్యిందని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక్కడ మరో విషయం ఏమంటే.. విజయ్‌కు ముందుగా ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం రెమ్యూనరేషన్ మొత్తం చెల్లించలేదట.. సినిమా విడుదలైన తర్వాత విజయ్ తన పూర్తి పేమెంట్ అందుకోవాల్సి ఉంది. అయితే లైగర్ డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు పూరీ ఆ మొత్తాన్ని చెల్లించలేని స్థితిలో లేడని టాక్. ఇక మరో విశేషం ఏమంటే.. విజయ్ కాదనడంతో పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాను హిందీ యాక్టర్స్‌తో చేయాలనీ చూస్తున్నాడట.. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Twitter
ఇక లైగర్ తర్వాత విజయ్ ఖుషి అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా కొత్త షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో మొదలుకానుందని తెలుస్తోంది. ఇక విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా లైగర్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న విజయ్, ఖుషి సినిమా షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. మరోవైపు అమెరికా వెళ్లిన సమంత కూడా తిరిగి రావడంతో మరో కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతోంది టీమ్.. Photo : Twitter
ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23, 2022న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. అయితే అది వాయిదా పడే అవకాశం ఉంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే విజయ్ గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే.. రామ్ చరణ్ కోసం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆ మధ్య ఓ కథను రెడీ చేసి వినిపించారట. అయితే ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ పూర్తిగా మారడంతో.. ఆ కథకు రామ్ చరణ్ సూట్ కారని.. ఫీల్ అవ్వడం.. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఆగిపోయిందని ఓ వార్త ఇటీవల వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్ననూరి అదే కథను తాజాగా విజయ్‌కు చెప్పడం జరిగిందని తెలుస్తోంది. విజయ్ కూడా దాదాపుగా ఓకే అన్నట్లు టాక్. ఈ సినిమాకు ఎన్వీ ప్రసాద్ నిర్మాత అని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
ఇక మరోవైపు విజయ్.. ఖుషి సినిమా తర్వాత త్రివిక్రమ్ కథతో ఓ సినిమాను చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. అంతేకాదు మరో వైపు విజయ్.. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న దిల్ రాజు ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశారట. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ సినిమా కూడా ప్రేమకథేనని అంటున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేశారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
ఇక లైగర్ విషయానికి వస్తే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger). అనన్యపాండే హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. Photo : Twitter
దేశవ్యాప్తంగా విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.. సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినిమాను చూసిన ప్రేక్షకులు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఎక్కువుగా పూరీ జగన్నాథ్‌ను తప్పుబడుతున్నారు నెటిజన్స్. Photo : Twitter
లైగర్ నష్టం 25 కోట్ల వరకు ఉండోచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా లైగర్ కారణంగా భారీ ధరకు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు దర్శకుడు పూరి డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపడుతోంది. దర్శకుడు పూరి మాట మీద నిలబడే వ్యక్తి అని, లైగర్ కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లలతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది.Photo : Twitter
మరోవైపు కర్ణుడి చావుకు వెయ్యి కారణాల చందంగా.. ఈ సినిమా మరో చెత్త రికార్డ్‌ను మూట గట్టుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ IMDb(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్‌లో లైగర్ సినిమాకు అతి తక్కువ రేటింగ్ వచ్చింది. అది చూసిన విజయ్ అభిమానులు షాక్ అవుతున్నారు. లైగర్ సినిమాకు ఐఎండిబిలో 10 పాయింట్స్‌కు కేవలం 1.7 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన డిజాస్టర్‌గా మారిన తమిళ సినిమా ది లెజెండ్ (4.7), అమీర్ ఖాన్ హిందీ లాల్ సింగ్ చడ్డా(5), తెలుగు సినిమా సన్ ఆఫ్ ఇండియాకు (5) కంటే తక్కువ రేటింగ్ నమోదు చేయడమేంటనీ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. Photo : Twitter
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ 11 కోట్ల మార్క్‌ని అందుకుంటుంది అనుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం మీద 9.57 కోట్ల రేంజ్లో షేర్ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 13.45 కోట్ల షేర్ అందుకుంది... Photo : Twitter
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేతులేత్తేసిన హిందీ బెల్ట్‌లో మాత్రం అదరగొట్టింది. ఈ సినిమా ప్రీమియర్స్‌తో కలిపి హిందీలో ఫస్ట్ డే సుమారు 6 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. దీంతో ఈ సినిమాకి హిందీలో అదిరే ఓపెనింగ్స్ దక్కినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప, రాధేశ్యామ్, బాహుబలి1 సినిమాలకు కూడా ఫస్ట్ డే ఈ రేంజ్లో రాలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. సినిమా టాక్ బాగుట్టే అదరగొట్టేదని అంటున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథ. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.. Photo : Twitter
ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వచ్చింది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. .పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై ఆగిపోయింది.. లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ సినిమాను బడ్జెట్ కారణాల వల్ల ఆపేశారు. Photo : Twitter