Liger - Vijay Devarakonda - Boxing Based Movies | సిల్వర్ స్క్రీన్ పై హీరోలు విలన్ పై పంచ్ డైలాగులు వేస్తే ఆడియన్స్‌కు ఎలాంటి కిక్ వస్తుందో.. అలా ఏకంగా బాక్సింగ్ రింగులో దిగి పంచ్ కొడితే ఆ మజాయే వేరు. ఇప్పటికే తెలుగు సహా పలు ఇండస్ట్రీకి చెందిన హీరోలు వెండితెరపై బాక్సింగ్‌తో బాక్సాపీస్ దగ్గర జోష్ నింపారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’ మూవీలో ప్రొఫెషనల్ బాక్సర్ పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో బాక్సింగ్ నేపథ్యంలో తెలుగులో వచ్చిన కొన్నిచిత్రాలేమిటో ఓ సారి చూద్దాం..
తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో సుమన్, భాను చందర్, వినోద్ కుమార్ వంటి ఒకప్పటి హీరోలు పలు చిత్రాలు చేసినా.. పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు సినిమా తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి. అన్నాదమ్ముల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమాదవశాత్తు బాక్సింగ్‌కు డిస్ క్వాలిపై అన్న కన్న కలను తమ్ముడు ఎలా ఒక బాక్సర్‌గా నెరవేర్చాడనేదే ఈ సినిమా స్టోరీ. (File/Photo)
అరుణ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సుభాష్ (సుబ్రహ్మణ్యం) పాత్రలో మంచి ఈజ్‌తో నటించారు. ఈ సినిమాలో బాక్సింగ్ కోసం పవన్ కళ్యాణ్ చేసిన రియల్ స్టంట్స్ ఎందరో హీరోలకు స్పూర్తి నింపాయి. ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్’ పాట కూడా ఎందరికో స్పూర్తదాయకంగా నిలిచింది. అంతకు మందు హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ వంటి ఇలాంటి సినిమాలతో అలరించినా.. తెలుగులో పవన్ కళ్యాణ్ చాలా యేళ్లకు ఈ తరహా చిత్రం చేయడంతో అప్పటి యూత్‌కు ఈ సినిమా బాగానే అలరించింది. (Twitter/Photo)
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా అసిన్ కథానాయికగా.. ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిందే. ఈ సినిమాలో హీరో తండ్రి ఓ బాక్సింగ్ చాంపియన్. తన లాగే తన శిష్యుడు ఒకడిని తయారు చేస్తాడు. అతను హీరో తండ్రిని మోసం చేస్తే.. రంగంలోకి దిగిన హీరో తన తండ్రి కోరికను ఎలా నెరవేర్చాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది. (Twitter/Photo)
జై | జై మూవీ తేజ్ దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీల్లో విభిన్నం అనే చెప్పాలి.ఈ సినిమాను భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధంలా సాగే ప్రేమ కథ. మిగతా చిత్రాల్లో ఫ్యామిలీ ఎమోషన్‌ను మిక్స్ చేసి తెరకెక్కిస్తే.. జై సినిమాను దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించారు. భారతీయులను తక్కువ చేసి మాట్లాడిన పాక్ బాక్సింగ్ ఛాంపియన్‌ను మన దేశపు యువకుడు బాక్సింగ్‌లో ఓడించి మన దేశపు సత్తా ఏమిటో చూపిస్తాడు. (file/Photo)
గురు | సాలా ఖడూస్.. గురు మాధవన్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సూరరై పొట్రు’ ఈ చిత్రాన్నిహిందీలో సాలా ఖడూస్‌గా విడుదలైంది. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. బాక్సింగ్ అసోసియేషన్ రాజకీయాలకు బలైన ఓ బాక్సర్ ఓ పల్లెటూరి యువతిని ఎలా ఛాంపియన్ చేసాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ చిత్రాన్నివిక్టరీ హీరో వెంకటేష్ చేయడం విశేషం. టాలెంట్‌కు డబ్బుతో పనిలేదని రితిక పాత్ర నిరూపిస్తే.. గురువు అంటే ఇలానే ఉండాలనే దానికి మాధవన్, ఇటు వెంకటేస్ తమ పాత్రలకు న్యాయం చేసారు. (File/Photo)
సార్పట్ట.. | సార్పట్ట పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన బాక్సింగ్ కథా చిత్రాల్లో ‘సార్ పట్ట’ ఒకటి. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆంగ్లేయులు సరదా కోసం కొంత మంది భారతీయులకు బాక్సింగ్ నేర్పిస్తారు. అది కొందరి కుటుంబాల్లో వంశపారపర్యంగా కొనసాగడం.. వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటించారు. హార్బర్ కూలి బాక్సింగ్ పై ఉన్న ప్రేమతో తన సార్పట్ట టీమ్‌ను ఎలా గెలిపించాడనేదే ఈ సినిమా కథాంశం. (File/Photo)
తుఫాన్ | తుఫాన్ ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన మూవీ ‘తుపాన్’. ముంబైలోని డోంగ్రీ లోని స్ట్రీట్ ఫైటర్ చాలా మొండివాడు. ఏదైనా అనుకుంటే అది జరగాల్సిందే. అలాంటి అజ్జు భాయ్ మొండితనంతో నేర్చుకున్న బాక్సింగ్ కంటే.. టెక్నికల్‌గా నేర్చుకున్న బాక్సింగ్ గొప్పతనం తెలుసుకొని బాక్సింగ్ గురువు నానా గురువు దగ్గర చేరి ప్రొఫెషనల్ బాక్సర్ అవుతాడు. ఈ చిత్రాన్ని రాకేశ్ ఓం ప్రకాష్ తెరకెక్కించారు. (Twitter/Photo
ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించిన సుశాంత్ రెడ్డి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయి.. భైరవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తరుణ్ భాస్కర్ సమర్ఫణలో తెరకెక్కతోంది. రోహిత్ తంజావూర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ మినహా మరే అప్డేట్ లేదు. (Twitter/Photo)
గని | ఈ యేడాది వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గని’ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిందే. ఈ సినిమా కూడా తండ్రి సాధించలేని బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌ను కొడుకు ఎలా నేర్చవేర్చాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అయింది. ఈ సినిమా కథ రొటీన్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. (Varun Tej Ghani two days collections Photo : Twitter)
లైగర్ మూవీ | విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరెక్కిన మూవీ ‘లైగర్’. ఈ సినిమాను కూడా పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పైగా విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళితే.. అక్కడ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సినిమాలో ఏకంగా బాక్సింగ్ ఐకాన్ మైక్ టైసన్ ముఖ్యపాత్రలో నటించడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. Vijay Devarakonda Liger Photo : Twitter