ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. Photo : Instagram" width="1080" height="1232" /> Ananya Panday: హిందీ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే 'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. Photo : Instagram
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. (Photo: ananyapanday/Instagram)
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది.
దీంతో టీమ్ దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసారు. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ నంబర్ వన్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీటు, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథలా కనిపిస్తోంది.
ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే.. యాక్షన్ సీన్స్, పూరీ టేకింగ్ ఓ రేంజ్లో ఉన్నాయని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన ఏడు గంటల్లో 8. 49 మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఇండియాలోనే తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ పొందిన ఫస్ట్ గ్లింప్స్‌గా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో (Ananya Panday )హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. (Photo: ananyapanday/Instagram)
ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ. లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.. (Photo: ananyapanday/Instagram)
లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. (Photo: ananyapanday/Instagram)
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. లైగర్‌లో విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. (Photo: ananyapanday/Instagram)
ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్‌తో ఉందనుందని తెలుస్తోంది. (Photo: ananyapanday/Instagram)