దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా. ఇక దాసరి దగ్గర పనిచేసిన పలువురు దర్శకులు టాప్ డైరెక్టర్స్‌గా టాలీవుడ్‌తో కోలీవుడ్‌లో రాణించారు. అందులో కోడిరామకృష్ణ, రవిరాజ పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కె.మురళీమోహన్ రావు, సురేష్ కృష్ణ, కే.యస్.రవికుమార్ టాంటి సుప్రసిద్ధ దర్శకులు దాసరి శిష్యరికంలోనే పెద్ద దర్శకులు అయ్యారు.
రవిరాజా పినిశెట్టి.. చిరుతో యముడికి మొగుడు, ఎస్పీ పరశురామ్, బాలయ్యతో ‘బంగారు బుల్లోడు’, వెంకటేష్‌తో ‘చంటి’, మోహన్ బాబుతో ‘పెదరాయుడు’ వంటి పలు బ్లాక్ బస్టర్స్ డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కూడా దర్శకరత్న దాసరి నారాయణ రావు శిష్యుడే. ఈయన తెలుగుతో పాటు బాలీవుడ్లో పలు చిత్రాలను డైరెక్ట్ చేసారు. (Twitter/Photo)