రామ్ చరణ్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో (NTR) ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో కనిపించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లను కలెక్ట్ చేసింది. దీంతో చిత్రబృందం నిన్న ముంబైలో సక్సెస్ పార్టీని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గెస్ట్లుగా నటులు అమీర్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్, రచయిత జావేద్ అక్తర్ వచ్చారు. Photo : Twitter
ఇక ఇదే కార్యక్రమానికి హిందీ దిగ్గజ దర్శక ద్వయం, అబ్బాస్ మస్తాన్లు కూడా హజరైయ్యారు. అంతేకాదు రామ్ చరణ్‌తో ఓ ఫోటోను దిగారు. అదే తమ ట్విట్టర్ అకౌంట్లో పంచుకుంటూ చరణ్‌తో కలిసి పనిచేయాలనీ ఉందని.. భవిష్యత్తులో ఆ అవకాశం రావాలనీ కోరుకుంటున్నట్లు తెలిపారు. అబ్బాస్ మస్తాన్ల విషయానికి వస్తే.. ఈ దర్శక ద్వయం హిందీ పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. బాజీగర్, రేస్ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు వీళ్లు దర్శకత్వం వహించినవే.. Photo : Twitter
ఇక ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. ఇక మరోవైపు ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 13 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. Photo : Twitter
దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 13 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే దాదాపుగా 98 కోట్ల గ్రాస్. ఇక హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అక్కడ 200 కోట్ల నెట్‌ను వసూలు చేసింది. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ (Roudram Ranam Rudhiram) బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇక రెండో వారంలో కూడా కేక పెట్టిస్తోంది. ఈ సినిమా తొమ్మిదో రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఊహకందని విధంగా.. ఏకంగా 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు తొమ్మిదో రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 37.12 కోట్ల షేర్ సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా 13వ రోజు రెండు రాష్ట్రాల్లో 2.54 కోట్ల షేర్ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్‌గా 7.45 కోట్ల వరకు వసూలు చేసింది. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా 75.50 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్రమోషన్లో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాట ఆర్ ఆర్ ఆర్ అభిమానులకి మరింత ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. Photo : Twitter
ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ నటులు (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. Photo : Twitter
మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. Photo : Twitter
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో రావడంతో పాటు దిల్ రాజు (Dil Raju)నిర్మాణంలో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2023లో సంక్రాంతికి రాబోతున్నట్లు టాక్ నడిచిన సంగతి తెలిసిందే. Photo : Twitter
అంతేకాదు దిల్ రాజు ఈ డేట్‌ను ఆల్ మోస్ట్ ఖరారు చేసినట్లు.. దీనికి తగ్గట్లుగానే ఆయన ప్లాన్ చేసినట్లు ఆ మధ్య టాక్ వినపడింది. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ప్లేస్‌లో విజయ్- వంశీ పైడిపల్లి సినిమా రాబోతుందని మరో వార్త హల్ చల్ చేస్తోంది. దిల్ రాజు 2023 సంక్రాంతి సీజన్ కోసం తలపతి 66ని తీసుకురానున్నారట. ఇక రామ్ చరణ్ శంకర్ RC15 సినిమా విడుదలను 2023 వేసవికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter