Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. అందాల రాక్షసి (Andala Rakshasi) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత.. ఆమె పలు సినిమాల్లో నటించినా నాని మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది. లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. టై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. మణిరత్నం గీతాంజలి హీరోయిన్ ని గుర్తుకు చేసింది.