ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రామ్, బోయపాటి శ్రీను సినిమా తెరకెక్కనుంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ తో చేయబోయే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ హీరో నటించబోతున్నట్టు సమాచారం. దాంతో పాటు హీరోయిన్ కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ హీరోయిన్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. (Twitter/Photo)
ఈ సినిమాలో రామ్ (Ram Pothineni) పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆడియో హక్కులకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కిచుకున్నట్లు సమాచారం. ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ జరిగినట్లు టాక్. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్ల అమ్ముడైనట్లు తెలుస్తోంది. (Twitter/Photo)
ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రామ్ కి ఇది కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంది. ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది.ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న ఈ సినిమాకు రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టారు. (Twitter/Photo)