సూపర్ స్టార్ కృష్ణతో బోయపాటి తీసిన ఈ అలనాటి చిత్రం తెలుసా.. వివరాల్లోకి వెళితే.. దివంగత సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. తొలి తెలుగు కలర్ చిత్రం సాంఘికం, తొలి జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్, 70 MM, DTS మూవీ సహా తెలుగు చిత్ర సీమకు ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు. దీంతో ఎంతో మంది టెక్నియషిన్స్ను పరిచయం ఘనత ఈ ఘట్టమనేని హీరోకే దక్కుతుంది. (Twitter/Photo)
సినిమాలో రాణించాలంటే నాటకాల్లో ఫ్రూవ్ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. 1960లో కృష్ణ తొలిసారిగా స్టేజ్ మీద 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం.ఆ తర్వాత 'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్' వంటి నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణ.(Twitter/Photo)
కృష్ణ తొలిసారి హీరోగా ఎంపికైన చిత్రం 'కొడుకులు కోడళ్ళు'. కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది. 'మూగ మనసులు' చిత్రం విడుదలైన తర్వాత 'తేనె మనసులు' కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్ యాడ్ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు. హీరోగా ఎంపికైనప్పటికీ బక్కగా ఉన్నావు, నువ్వేం నటిస్తావని చాలా మంది దెప్పిపోడిచారట. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు జడ్జ్మెంట్ తప్పన్నారు. కానీ ఆ సినిమా సూపర్ హిట్టై హీరోగా కృష్ణ కెరీర్‌నే పూర్తిగా మార్చేసింది. (Twitter/Photo)
1968 నుంచి 74 వరకు ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఆ టైమ్‌లో తెనాలిలో ఉన్న ఏడు థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవంటే అతిశయోక్తి కాదు. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన ఘనత కృష్ణదే. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు ముద్దుగా 'సూపర్‌స్టార్' అని పిలుచుకుంటారు. అంతేకాదు 1500 పైగా అభిమాన సంఘాలున్నా హీరోగా రికార్డులు క్రియేట్ చేసారు. (File/Photo)
ఆయన నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబారు చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ఓ.ఆర్.డబ్ల్యు రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (తెలుగు వీర లేవరా..).. తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో నూతన టెక్నాలజీలను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. తన కెరీర్లో ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. అందులో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు ‘థిల్లానా’టైటిల్‌తో తెరకెక్కిన సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసినా ఏవో కారణాల వల్ల ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. (Twitter/Photo)
ఆ తర్వాత 1997లో ‘బొబ్బలిదొర’ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో కృష్ణ త్రిపాత్రాభినయం చేసారు. హీరోగా ఏడో త్రిపుల్ రోల్ మూవీ. అంతకు ముందు.. సూపర్ స్టార్ కృష్ణ .. ‘కుమారారాజా’, డాక్టర్ సినీ యాక్టర్,సిరిపురం మొనగాడు, పగపట్టిన సింహం,రక్త సంబంధం,బంగారు కాపురం వంటి సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసారు. ఇక బొబ్బలి దొర సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా అన్నదమ్ములుగా అందులో ఒక హీరో తనయుడిగా మూడు పాత్రల్లో నటించారు కృష్ణ.
ఈ సినిమాలో కృష్ణ సరసన సంఘవి, విజయ నిర్మల హీరోయిన్స్‌గా నటించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో బోయపాటి కామేశ్వరరావు అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన మరే సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకోలేదు. కానీ ఆయన ఇంటి పేరుతో ఉన్న బోయపాటి శ్రీను ఇపుడు టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా సత్తా చాటుతున్నారు.(Twitter/Photo)