తాను ఉన్నా లేకపోయినా మంచి పనులు ఆగకూడదు అంటూ 8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు పునీత్. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నిజంగానే దైవాంశ సంభూతుడు అనిపిస్తోంది. అందుకే అతడు మరణించి ఇన్ని రోజులైనా ప్రజల గుండెల్లో ఇంకా జీవించే ఉన్నాడు. ఎప్పటికీ జీవించే ఉంటాడు కూడా. ఇప్పుడు ఈయన బయోపిక్ రాబోతుందని కన్నడనాట ప్రచారం జరుగుతుంది.